Nagarjuna Hair Care: 66 ఏళ్ల వయస్సులోనూ కుర్రాళ్ల జుట్టులా నాగార్జున హెయిర్ స్టైల్.. అసలేంటి రహస్యం!

Nagarjuna Hair Care: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలిలో వచ్చిన మార్పులు జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 66 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున అక్కినేని తన ఒత్తైన, నల్లటి జుట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అలవాట్లు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. నాగార్జున...