White House: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ సమావేశం
White House: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగింది. వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక భేటీ నిర్వహించనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య భాగస్వామ్యం, రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ వ్యూహం, అంతర్జాతీయ భద్రతా అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముందని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల ఫ్రాన్స్, స్లోవేకియా...