Indian Railways: జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఏసీ కోచుల్లోకి వెళుతున్నారా..?
Indian Railways: రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు భారతీయ రైల్వే శాఖ అనేక నిబంధనలను అమలు చేస్తోంది. ప్రతి ప్రయాణికుడు తాను కొనుగోలు చేసిన టికెట్‌కు అనుగుణంగా మాత్రమే కోచ్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు రైల్వే నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవడంతో జనరల్ టికెట్ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో టికెట్ తనిఖీ సమయంలో జరిమానాలు, ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే చాలామంది జనరల్ టికెట్ కొనుగోలు చేసి రైలెక్కుతుంటారు. అయితే జనరల్ టికెట్ ఉన్నవారు కేవలం...