Stray Dog Attack: కుక్కలు వెంబడిస్తే బైక్ వేగం పెంచడం కరెక్టేనా?

Stray Dog Attack: ప్రస్తుతం దేశంలోని అనేక పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా మారుతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వీధి కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఒంటరిగా నడిచే వ్యక్తులు వీటి బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా కుక్కలు మనుషులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే భయం, తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే స్వభావం, పిల్లలను రక్షించాలనే భావన లేదా ఆకస్మికంగా కలిగే ఉద్రిక్తత కారణంగా కొన్ని సందర్భాల్లో దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడకుండా సరైన విధంగా స్పందిస్తే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా వాహనంపై...