Technology: ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
Technology: ప్రపంచ టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో సంచలన మార్పులకు కారణమైన ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించి అపూర్వ విజయాన్ని నమోదు చేయడంతో మస్క్ వ్యక్తిగత సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ నిలిచినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. స్పేస్‌ఎక్స్ షేర్లకు లభించిన భారీ ఆదరణ కారణంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకోగా, మస్క్ సంపద సుమారు రూ.1.1 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఇటీవల స్పేస్‌ఎక్స్ చరిత్రలోనే అతిపెద్ద...