Assam: కామాఖ్య ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత?
Assam: అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించేందుకు సిద్ధమవుతున్న భక్తులకు ఆలయ యాజమాన్యం కీలక సూచనలు జారీ చేసింది. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించడం, దర్శన ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ప్రత్యేక దర్శనం టిక్కెట్ల జారీ విధానంలో పెద్ద మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆఫ్లైన్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ, ఇకపై ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కేవలం ఆన్లైన్ ద్వారానే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు ముందుగానే తమ దర్శన సమయాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి...