Laundry Tips: ఈ బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తున్నారా?.. అస్సలు వేయకండి
Laundry Tips: వాషింగ్ మెషీన్ ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంటిలో కనిపించే అత్యంత ఉపయోగకరమైన గృహోపకరణంగా మారింది. దుస్తులను తక్కువ సమయంలో శుభ్రంగా ఉతకడంతో పాటు శ్రమను కూడా గణనీయంగా తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే సామాన్యులు నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు చాలా మంది వాషింగ్ మెషీన్ను నిత్యావసర వస్తువుగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్లు వాషింగ్ మెషీన్ పనితీరును దెబ్బతీయడమే కాకుండా, ఖరీదైన దుస్తులు కూడా పాడయ్యే పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఏ బట్టనైనా నేరుగా వాషింగ్ మెషీన్లో వేయడం సరైన పద్ధతి కాదని, ప్రతి దుస్తుపై ఉండే సంరక్షణ సూచనలను పరిశీలించిన తర్వాత మాత్రమే...