ICC 2027: వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేసాయ్..

ICC 2027: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలలో ఒకటైన పురుషుల వన్డే ప్రపంచకప్ 2027కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి తాత్కాలిక షెడ్యూల్, వేదికల ప్రణాళికను అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధం చేసినట్లు సమాచారం. అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ప్రపంచకప్ పోటీలు నిర్వహించేలా ప్రణాళిక ఖరారైంది. గత మే నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక...