Crime: ప్రియుడితో రాసలీలల కోసం.. కూతురిని చంపిన తల్లి!
Crime: మాతృత్వం అనే పవిత్ర బంధానికే మచ్చతెచ్చేలా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పరాయి వ్యక్తితో ఏర్పడిన సంబంధం కోసం ఓ తల్లి తన ఐదేళ్ల కన్నకూతురినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులను నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసిన ఈ ఘటనలో, ఒక వైద్యుడి అనుమానం కారణంగానే అసలు నిజం బయటపడింది. నిందితురాలు వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేయడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులు సుమారు...