Eega Mallesham: ఘనంగా ప్రారంభమైన శ్రీ సరస్వతి శిశు మందిర్
ప్రారంభించిన కేంద్ర, ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం చదువుతో పాటు సంస్కారాన్ని అందించే “చదువుల తల్లి”గా సరస్వతి శిశు మందిర్ గుర్తింపు : కేంద్ర, ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం Eega Mallesham: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ (ఇంగ్లీష్ మీడియం) విద్యాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సమాజ శ్రేయస్సు, విద్యా వికాసం కోసం ప్రత్యేక చండీయాగాన్ని నిర్వహించగా, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా...