Language Facts: OK అని అందరూ అంటారు.. కానీ ఈ పదం గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు..
Language Facts: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ ఉపయోగించే పదాల్లో అత్యంత సాధారణమైనది “OK”. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సందేశాలు పంపేటప్పుడు, కార్యాలయ పనుల్లో, స్నేహితులతో సంభాషణల్లో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఎన్నోసార్లు ఉపయోగిస్తుంటాం. కేవలం 2 అక్షరాలతో అంగీకారం, సమ్మతి, సంతృప్తి, నిర్ధారణ వంటి అనేక భావాలను వ్యక్తపరిచే ఈ చిన్న పదం వెనుక దాదాపు 200 ఏళ్ల చరిత్ర దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఉపయోగిస్తున్న ఈ పదం ఎలా పుట్టింది, ఎలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్న విషయం ఎంతో ఆసక్తికరంగా...