Telangana: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్

Telangana: ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ (ఫ్యాన్సీ నంబర్) కోరుకునే వాహన యజమానులకు తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 30 రోజులుగా ఉన్న ఈ గడువును ఇప్పుడు 60 రోజులకు పెంచడంతో వాహన యజమానులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఈ నిర్ణయంతో ప్రత్యేక సంఖ్యలపై ఆసక్తి ఉన్నవారు తొందరపాటు లేకుండా తమకు నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం పొందనున్నారు. సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసిన వెంటనే రవాణా శాఖ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను జారీ చేస్తుంది....