Metro Phase-2: కేంద్రం ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన!
Metro Phase-2: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కేంద్ర నిధులు, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న అనుమతుల సాధన లక్ష్యంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో హైదరాబాద్ నగర విస్తరణ వేగం, పెరుగుతున్న జనాభా, రోజురోజుకూ అధికమవుతున్న ట్రాఫిక్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని...