TRS: కవిత కొత్త పార్టీకి షాక్ తప్పదా..?
TRS: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశంగా కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మారింది. ఈ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రక్షణ సేన పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ పార్టీ పేరుపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తుల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ తన అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది....