Raghava Lawrence: రాజకీయాల్లోకి రావాలా.. వద్దా?.. ఫ్యాన్స్‌ను అడిగిన హీరో
Raghava Lawrence: తమిళనాడు రాజకీయాల్లో నటులు, సినీ ప్రముఖుల ప్రవేశంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం తాజాగా మరింత ఊపందుకుంది. ముఖ్యంగా తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలపై రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఊహాగానాల మధ్య రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో తన రాజకీయ భవిష్యత్తు గురించి అభిమానులతో నేరుగా మాట్లాడిన ఆయన, రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయంపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం...