Dhee Pandu: నెల సంపాదన ఎంతో చెప్పిన పండు మాస్టార్..
Dhee Pandu: ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ పండు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం సమీపంలోని ఆనందపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగిపోవడంతో వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఇప్పటికే 2 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని, పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పండు గతంలో తన కుటుంబం గురించి చెప్పిన కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు...