Scientific Discovery: మరణాన్ని సవాలు చేస్తున్న అమర జెల్లీఫిష్

Scientific Discovery: ప్రపంచంలోని ప్రతి జీవికి జననం ఎంత సహజమో, మరణం కూడా అంతే సహజం. ప్రకృతి నిర్దేశించిన ఈ నియమం నుంచి ఎవరూ తప్పించుకోలేరని విజ్ఞాన శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అయితే సముద్ర గర్భంలో నివసించే ఒక సూక్ష్మ జీవి మాత్రం ఈ సహజ సూత్రాన్నే సవాలు చేస్తూ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వృద్ధాప్యాన్ని జయించే అసాధారణ సామర్థ్యం కలిగిన ఈ జీవిని శాస్త్రవేత్తలు టర్రిటాప్సిస్ డోర్ని అని పిలుస్తారు. సాధారణంగా దీనిని “అమర జెల్లీఫిష్”గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో సహజ వృద్ధాప్యాన్ని తిరస్కరించే సామర్థ్యం కలిగిన ఏకైక జీవిగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. పరిమాణంలో చాలా చిన్నదైన ఈ జీవి కేవలం 4.5...