El Nino effect: కరువు ముప్పుపై ప్రధాని మోదీ రెడ్ అలర్ట్!

El Nino effect: వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారతదేశం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కీలక సమావేశంలో “వికసిత భారత్@2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి” అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. దేశ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం అత్యంత అవసరమని...