Missing Child: చిన్నారి జాహ్నవి ఏమైంది?.. కుక్క ప్రవర్తనలో మార్పు..?

Missing Child: కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 6 రోజులు గడిచినా ఆమె ఆచూకీ ఇంకా లభించకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వందలాది మంది పోలీసులు, ప్రత్యేక గాలింపు బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్థులు నిరంతరం శోధనలు కొనసాగిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క స్పష్టమైన ఆధారం కూడా లభించకపోవడంతో ఈ ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న జాహ్నవి ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మొదట కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో...