Telangana: మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
Telangana: వేసవి సెలవుల సందడి మధ్య మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా దాగుడుమూతల ఆట ఆడుకుంటున్న ఓ చిన్నారి అనుకోని ప్రమాదానికి బలైంది. క్షణాల్లో జరిగిన ఈ విషాద ఘటన కుటుంబాన్ని, గ్రామాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఆటలో దాక్కున్న చిన్నారిపై కూలిన గోడ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన ఏముర్ల శేఖర్, భాగ్య దంపతుల కుమార్తె సునైత్రి (7) తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో దాగుడుమూతల ఆట ఆడుకుంటోంది. ఆటలో భాగంగా ఓ ఇంటి గోడ పక్కన దాక్కున్న సమయంలో అకస్మాత్తుగా ఆ పాత గోడ కూలిపోయి చిన్నారిపై పడింది. గోడ...