IRCTC: రైళ్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్

IRCTC: భారతీయ రైల్వేల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసే సమయంలో అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. రైల్వే అనుమతి లేకుండా ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న 14 అనధికార వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఫిర్యాదులు చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత, వ్యక్తిగత సమాచారం రక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో ఫుడ్ డెలివరీకి పెరిగిన డిమాండ్.. ఇటీవలి కాలంలో రైలు ప్రయాణ సమయంలో మొబైల్...