Text Claw: స్మార్ట్ ఫోన్ వాడకంతో ప్రమాదంలో చేతులు..?
Text Claw: స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్లు నేటి జీవితంలో విడదీయరాని భాగాలుగా మారిపోయాయి. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ డిజిటల్ జీవనశైలి కొత్త ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా యువతలో వేళ్లు, మణికట్టు, చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు, బిగుతు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితినే సాధారణంగా ‘టెక్స్ట్ క్లా’ అని పిలుస్తున్నారు. ఏమిటీ టెక్స్ట్ క్లా? టెక్స్ట్ క్లా అనేది ఒక అధికారిక వైద్య నిర్ధారణ కాకపోయినా, ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు ఉపయోగించడం వల్ల చేతులు, వేళ్లు, మణికట్టుపై పడే అధిక ఒత్తిడిని సూచించే పదం....