Vastu Tips: తప్పు దిశలో దేవుళ్ల ఫోటోలు పెడితే ఏమవుతుంది..?
Vastu Tips: ఇంట్లో పూజా మందిరం, దేవతల ఫోటోలు లేదా విగ్రహాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు, సానుకూల శక్తికి కూడా ప్రతీకలుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం దేవతల చిత్రాలను సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం, సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్మకం. అయితే చాలామంది తెలియక దేవుళ్ల ఫోటోలను ఏ గోడపై పడితే ఆ గోడపై ఏర్పాటు చేస్తుంటారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కొన్ని ప్రతికూల ప్రభావాలకు కారణమవుతుందని చెబుతారు. దేవుళ్ల ఫోటోలను తప్పు దిశలో ఉంచితే ఏమవుతుందని నమ్మకం..? వాస్తు సంప్రదాయాల ప్రకారం దేవతల చిత్రాలను అనుచిత దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి...