Motivation: ఈ రూల్స్‌తో సక్సెస్ ఎప్పుడూ మీ వెంటే..
Motivation: ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ వినోదం, నిరంతర సమాచార ప్రవాహం కారణంగా చాలా మంది ఏకాగ్రత కోల్పోతున్నారు. లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ వాటిని సాధించే క్రమంలో క్రమశిక్షణ లోపించడం, ఆలస్యం చేయడం, చిన్న చిన్న ఆటంకాలకే వెనక్కి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సైనిక దళాలు దశాబ్దాలుగా పాటిస్తున్న కొన్ని సాధారణ నియమాలు వ్యక్తిగత జీవితంలోనూ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాలు కేవలం విజయానికే కాకుండా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, సమర్థవంతమైన పనితీరుకు కూడా దోహదపడతాయి. మొదటిగా సమయపాలనను మిలిటరీలో అత్యంత కీలకంగా పరిగణిస్తుంది. నిర్ణయించిన సమయానికి చేరుకోవడం సరిపోదని, దానికంటే ముందుగానే సిద్ధంగా ఉండటమే నిజమైన...