Cyber Security: అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Cyber Security: సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల భద్రత కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ కీలక చర్యలు చేపడుతోంది. ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు అత్యాధునిక ‘స్కామ్ కాల్ డిటెక్షన్’ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే సమయంలో సృజనాత్మక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘జెమిని ఓమ్ని’ అనే శక్తివంతమైన కృత్రిమ మేధస్సు సాధనాన్ని పరిచయం చేస్తోంది. వినియోగదారుల భద్రతను పెంచడంతో పాటు వీడియోల సృష్టిని మరింత సులభతరం చేయడమే ఈ రెండు ఫీచర్ల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు అధికారులు, క్రెడిట్ కార్డు ప్రతినిధులు లేదా ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేసే...