Ram Charan: మీ రాక కోసం ఎదురుచూస్తున్నా..

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటున్న ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ తన స్పందనలో రామ్ చరణ్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు....