Micro-detachment: ఒత్తిడికి సరికొత్తగా చెక్ పెడుతున్న GenZలు
Micro-detachment: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉద్యోగ ఒత్తిడి, చదువుల భారం, వ్యక్తిగత బాధ్యతలు, నిరంతర డిజిటల్ వినియోగం కారణంగా మానసిక అలసట అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా యువతలో ఒత్తిడి, ఆందోళన, అధిక ఆలోచనలు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక ప్రశాంతత కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మైక్రో-డిటాచ్మెంట్’ అనే విధానం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. రోజువారీ బాధ్యతల నుంచి పూర్తిగా దూరం కావడం కాకుండా, మధ్య మధ్యలో కొద్దిసేపు మనసుకు విశ్రాంతి కల్పించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమే ఈ పద్ధతి ప్రధాన లక్ష్యం. మైక్రో-డిటాచ్మెంట్ అంటే పనులను వదిలేయడం లేదా బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం కాదు. రోజులో...