Temple Prasadam: ఈ 5 దేవాలయాలలోని ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లడం నిషేధం.. ఎందుకంటే..?

Temple Prasadam: హిందూ సంప్రదాయంలో దేవాలయ దర్శనం అనంతరం ప్రసాదం స్వీకరించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. దేవునికి సమర్పించిన నైవేద్యం భక్తులకు ప్రసాదంగా అందిన తర్వాత దానిని దైవానుగ్రహంగా భావించి స్వీకరించడం ఆనవాయితీ. సాధారణంగా భక్తులు ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పంచుకుంటారు. అయితే భారతదేశంలోని కొన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో మాత్రం ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లకుండా ప్రత్యేక సంప్రదాయాలు అమలులో ఉన్నాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల కారణంగా ఈ నియమాలు ఇప్పటికీ పాటించబడుతున్నాయి. అస్సాంలోని గౌహతి నగర సమీపంలోని నీలాచల్ పర్వతంపై వెలసిన కామాఖ్య దేవి ఆలయం దేశంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాల్లో...