APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం

APSRTC: మహిళా ప్రయాణికుల సౌకర్యాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు అవసర సమయాల్లో ఉపయోగపడేలా శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మహిళా ప్రయాణికులకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపశమనం కలగనుంది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళల ఆరోగ్యం, గౌరవం, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను అమలు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఇటీవల రవాణాశాఖ మంత్రికి లేఖ రాశారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళలు అనుకోని...