Tollywood: చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..

Tollywood: దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలకు కొత్త నిర్వచనం ఇచ్చిన అరుదైన నటుల్లో రఘువరన్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. తన ప్రత్యేకమైన హావభావాలు, విభిన్నమైన డైలాగ్ చెప్పే తీరు, కళ్లతోనే భావాలను వ్యక్తపరిచే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించారు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన పేరు వినగానే గుర్తుకు వచ్చేది ‘శివ’ చిత్రంలోని భవాని పాత్ర. ఆ పాత్రతో రఘువరన్ కేవలం ఒక నటుడిగానే కాకుండా కల్ట్ విలన్‌గా గుర్తింపు పొందారు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ సినీ అభిమానుల మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లంగుడై ప్రాంతంలో జన్మించిన రఘువరన్,...