IND vs AFG: ‘అన్న ఇచ్చిన టిప్స్ అన్న మీదే వాడుతా’..

IND vs AFG: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఇప్పుడు అదే అనుభవాన్ని భారత జట్టుపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాడు. జూన్ 13 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానున్న భారత్-అఫ్గానిస్తాన్ 3 వన్డేల సిరీస్‌కు ముందు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మతో కలిసి గడిపిన సమయం తనకు ఎంతో విలువైన పాఠాలను నేర్పిందని, ఇప్పుడు ఆ అనుభవం అఫ్గానిస్తాన్ జట్టుకు ఉపయోగపడేలా చూసుకుంటానని గజన్‌ఫర్ చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కేవలం 19 ఏళ్ల వయసులోనే...