Railway Connectivity: ఇప్పటికీ రైలు మార్గం లేని ఏకైక రాష్ట్రం ఇదే..

Railway Connectivity: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రాన్ని రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తూ ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే ఇంత విస్తారమైన రైల్వే నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ భారతీయ రైల్వే సేవలు చేరని ఒక రాష్ట్రం ఉంది. అదే హిమాలయాల ఒడిలో ఉన్న సిక్కిం. ప్రస్తుతం దేశంలో రైల్వే కనెక్టివిటీ లేని ఏకైక రాష్ట్రంగా సిక్కిం కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైల్వే స్టేషన్ కూడా పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. అలాగే పనిచేస్తున్న రైల్వే మార్గం కూడా అందుబాటులో లేదు. సిక్కింకు రైల్వే మార్గం...