Fuel Costs: భారత్‌లో పెట్రోల్ పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
Fuel Costs: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా పడటంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశంగా భారత్‌కు అంతర్జాతీయ పరిణామాలు నేరుగా ప్రభావం చూపుతుంటాయి. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా వ్యయాలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని గణాంకాల...