Spiritual: చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్బుత శ్లోకాలు ఇవే!

Spiritual: సనాతన ధర్మంలో విఘ్నాలను తొలగించే దేవుడిగా శ్రీ గణపతికి విశిష్ట స్థానం ఉంది. అందుకే విద్యాభ్యాసం, పరీక్షలు, కొత్త పనులు లేదా ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు వినాయకుడిని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతిరోజూ ఉదయం గణేశ శ్లోకాలను పఠించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం చిన్న వయస్సులోనే శ్లోక పఠనం అలవాటు చేస్తే పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెరిగి చదువుపై ఆసక్తి మరింత మెరుగుపడుతుంది. చదువు ప్రారంభించే ముందు చెప్పాల్సిన శుక్లాంబరధరం శ్లోకం.. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ అర్థం: తెల్లని వస్త్రాలు...