Accident: పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్! (VIDEO)

Accident: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ దేశ సైన్యంలో విషాదం నెలకొంది. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలోని నీలం లోయ ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి నేలకూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు,...