Legal Issues: చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలు శిక్ష ఉంటుంది..?

Legal Issues: డిజిటల్ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు డబ్బు జమ చేయడం, నగదు ఉపసంహరించుకోవడం లేదా ఇతరులకు నగదు పంపించడం కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూలలో నిలబడి పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలతో ఇంట్లో నుంచే క్షణాల్లోనే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు బదిలీలు మరింత సులభంగా మారాయి. అయినప్పటికీ వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు మరియు పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం ఇప్పటికీ చాలామంది...