TamilNadu: ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా కనిపించిన అద్భుత దృశ్యం
TamilNadu: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఇల్లు నిర్మాణం కోసం చేపట్టిన పునాది తవ్వకాల సమయంలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. నాగపట్నంలోని న్యూ బీచ్ రోడ్డులో రామప్రసన్న అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో ఇటీవల కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పునాది కోసం కార్మికులు భూమిని తవ్వుతున్న సమయంలో సోమవారం రాత్రి అరుదైన పురాతన శిల్పాలు బయటపడటంతో అక్కడ ఒక్కసారిగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తవ్వకాల సమయంలో మొదటగా సుమారు 2 అడుగుల ఎత్తు కలిగిన శివపార్వతుల విగ్రహం కనిపించగా, దానిని చూసిన కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం మరింత లోతుగా...