Hyderabad: నరరూప రాక్షసులకు మరణశిక్ష విధించిన కోర్టు..!

Hyderabad: హైదరాబాద్ మహానగరాన్ని ఒకప్పుడు కుదిపేసిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హత్య కేసులో మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి, పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రినే అత్యంత దారుణంగా హత్య చేసి, అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆధారాలు మాయం చేయాలని ప్రయత్నించిన కొడుకు, కూతురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘోర నేరానికి సహకరించిన మృతుడి భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. కుటుంబ బంధాలకంటే ధనదాహం ఎంతటి విషాదాలకు దారితీస్తుందో ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది. దర్యాప్తు వివరాల ప్రకారం.. బాధితుడు రైల్వే శాఖలో గూడ్స్ రైలు లోకో పైలట్‌గా పనిచేసి, ఆరోగ్య కారణాలతో 2000 సంవత్సరంలో...