Andhra Pradesh: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదార, రాగులు, జొన్నలు వంటి నిత్యావసర వస్తువులను అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా మినీ మార్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీ మార్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్టుల ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి నాణ్యమైన నిత్యావసర వస్తువులను రాయితీ ధరలకు అందించనున్నారు. దీంతో సాధారణ కుటుంబాలపై పెరుగుతున్న జీవన వ్యయ...