Viral News: 80 ఏళ్లకు పెళ్లికి రెడీ.. వధువుకు ఓ కండీషన్..?

Viral News: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించేలా బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధ కోటీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. 80 ఏళ్లకు చేరువలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త తన జీవిత భాగస్వామి కోసం బహిరంగంగా అన్వేషణ ప్రారంభించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తనను వివాహం చేసుకునే మహిళకు విలాసవంతమైన జీవితం, కోట్లాది రూపాయల ఆస్తులు, రాజసమైన హోదా కల్పిస్తానని ప్రకటించడంతో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సర్‌ బెంజమిన్‌ స్లేడ్‌ బ్రిటన్‌లోని ప్రసిద్ధ సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు చెందిన ‘మాన్‌సెల్ హౌస్’ అనే చారిత్రాత్మక భవనం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది....