Jagtial: తండ్రి చితి ముందే ఆస్తి కోసం ఘర్షణ
Jagtial: మరణం అనేది కుటుంబ సభ్యులను ఒక్కచోట చేర్చి, గత విభేదాలను మరచిపోయే సందర్భంగా భావిస్తారు. కానీ జగిత్యాలలో జరిగిన ఓ ఘటన మాత్రం నేటి సమాజంలో బంధాలు, అనుబంధాల కంటే ఆస్తికే ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందనే చేదు నిజాన్ని మరోసారి బయటపెట్టింది. జీవితాంతం కుటుంబం కోసం శ్రమించిన ఓ వృద్ధుడి అంత్యక్రియల సమయంలోనే కుటుంబ సభ్యులు ఆస్తి వివాదాలతో పరస్పరం ఘర్షణకు దిగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జగిత్యాల పట్టణంలోని హనుమాన్వాడకు చెందిన జంగిలి మల్లయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. అయితే ఆయన మృతదేహం ఇంట్లో ఉండగానే కుటుంబంలో ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మల్లయ్యకు చెందిన ఆస్తుల...