Ponguleti Srinivas: ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదు

Ponguleti Srinivas: ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి, వాస్తవ పరిస్థితులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి పట్టణ శివారులోని వేశ్యకాంతల చెరువు పరిసర ప్రాంతాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించి భూముల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండి రెహనా కమల్ పాషా, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి భూభాగాన్ని పరిశీలించిన మంత్రి, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన తీరుపై...