Girl Video: లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా..!
Girl Video: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన కొద్దీ గుర్తింపు కోసం వినూత్న ప్రయత్నాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొన్ని వీడియోలు వినోదంగా నిలుస్తుండగా, మరికొన్ని మాత్రం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా విదేశీ నగరంలోని ఓ బహిరంగ ప్రదేశంలో చిత్రీకరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల మధ్య విస్తృత చర్చకు కారణమైంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ భారతీయ యువతి పబ్లిక్ రోడ్డుపై టవల్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది వీక్షించారు. కొందరు దీనిని వ్యక్తిగత అభిరుచిగా చూడగా, మరికొందరు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో...