CM Chandrababu Naidu: మోదీ హయాంలో నూతన స్వర్ణయుగం వైపు భారత్

ACM Chandrababu Naidu: భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిని అధిగమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. దేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ సాధించిన ఘనత భారత ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. “దేశమే ప్రథమం” అనే సిద్ధాంతంతో సాగుతున్న మోదీ పాలన దేశానికి కొత్త దిశను చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం తన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మోదీ నాయకత్వం కీలకంగా నిలిచిందని చంద్రబాబు తన ప్రత్యేక వ్యాసంలో పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ జ్ఞానం, సంప్రదాయాలను...