Personal Finance: బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు పంపడం ఎలా..?
Personal Finance: డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో డబ్బులు పంపాలంటే లేదా స్వీకరించాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డబ్బులను పంపడం, స్వీకరించడం సాధ్యమే. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో లేదా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ విధానాలు ఉపయోగపడతాయి. అయితే ప్రతి సేవకు వేర్వేరు నిబంధనలు, పరిమితులు ఉంటాయి. కొన్ని సేవలు పూర్తి స్థాయిలో నగదు ఆధారంగా పనిచేస్తే, మరికొన్ని డిజిటల్ వాలెట్ల రూపంలో సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఇవే. డిజిటల్...