Viral Video: ఇలాంటి జ్యూస్ తాగితే పైకి పోవడం పక్కా..!
Viral Video: ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చాలా మంది తక్కువ ధరకు లభించే జ్యూస్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు మ్యాంగో, ఫ్రూట్ ఫ్లేవర్ జ్యూస్ ప్యాకెట్లను ఇష్టంగా తాగుతుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్యాకేజ్డ్ పానీయాల నాణ్యతపై కొత్త చర్చకు దారితీసింది. రూ.10 విలువైన జ్యూస్ ప్యాకెట్‌ను కత్తిరించి చూడగా అందులో నల్లటి పదార్థం కనిపించిందని చూపిస్తున్న వీడియో నెటిజన్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ఒక వ్యక్తి జ్యూస్ ప్యాకెట్‌ను పూర్తిగా తెరిచి లోపలి భాగాన్ని పరిశీలించాడు. ఈ సమయంలో ప్యాకెట్ అడుగుభాగంలో, స్ట్రా వెళ్లే ప్రాంతం వద్ద నల్లటి మురికి...