Sunny Leone: గ్లామరస్ క్వీన్‌కు సీఐడీ నోటిసులు

Sunny Leone: బాలీవుడ్ గ్లామర్ స్టార్ సన్నీ లియోన్ పేరు ఇప్పుడు ఒక భారీ ఆర్థిక మోసానికి సంబంధించిన దర్యాప్తులో ప్రస్తావనకు రావడం సినీ, వ్యాపార వర్గాల్లో చర్చకు దారితీసింది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన రూ.2,400 కోట్ల పోంజీ కుంభకోణం కేసులో విచారణ చేపడుతున్న సీఐడీ అధికారులు సన్నీ లియోన్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వేలాది మంది పెట్టుబడిదారులు మోసపోయినట్లు ఆరోపణలు ఉండగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ కోణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. శివమ్ అసోసియేట్స్ పేరిట కార్యకలాపాలు నిర్వహించిన సంస్థ అధినేత శివానంద నీలణ్ణవర్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు...