Smriti Mandhana: ‘మ్యాచ్ మధ్యలో పిరియడ్స్ వస్తే’.. చేతులెత్తి దండం పెట్టే ఆన్సర్!! (VIDEO)
Smriti Mandhana: సాధారణంగా క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ఎదుర్కొనే సవాళ్లు అంటే గాయాలు, ఒత్తిడి, ప్రత్యర్థి జట్టు వ్యూహాలు, వాతావరణ పరిస్థితులనే అభిమానులు ఊహిస్తారు. అయితే మహిళా క్రికెటర్లు మాత్రం వీటితో పాటు మరో ప్రత్యేకమైన శారీరక సవాలును కూడా ఎదుర్కొంటుంటారు. తాజాగా భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించిన అనుభవం ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే ఇబ్బందులను ఆమె బహిరంగంగా పంచుకోవడంతో క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడిన స్మృతి మంధాన, భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో...