Life style: సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్
Life style: రోజంతా ఒకేచోట కూర్చుని పని చేసే ఉద్యోగుల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, బరువు పెరగడం సాధారణంగా కనిపించే సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో దిగువ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా చేరి శరీర ఆకృతిలో మార్పులు తీసుకురావడం వల్ల ఆందోళనకు గురవుతున్నారు. అయితే బరువు నియంత్రణకు, పొట్ట తగ్గించుకోవడానికి ఖరీదైన డైట్లు లేదా కఠినమైన వ్యాయామాలే మార్గం కాదని, ప్రతిరోజూ రాత్రి భోజనం చేసే సమయాన్ని మార్చుకోవడం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి బరువు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని పలు...