Science Facts: భూమి అంతమైనా బతికే జీవి.. బొద్దింకల సర్వైవల్ సీక్రెట్!
Science Facts: కోట్లాది సంవత్సరాలుగా భూమిపై ఎన్నో జీవజాతులు పుట్టి అంతరించిపోయాయి. ఒకప్పుడు భూమిని ఏలిన భారీ డైనోసార్లు కూడా ప్రకృతి విపత్తుల కారణంగా పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా, మన ఇళ్లలో కనిపించే చిన్న బొద్దింక మాత్రం నేటికీ తన ఉనికిని కొనసాగిస్తోంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. బొద్దింకలు భూమిపై ఉన్న అత్యంత పురాతన జీవుల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. ఇవి సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే డైనోసార్లు భూమిపై సంచరించడానికి చాలా కోట్ల సంవత్సరాల ముందే బొద్దింకలు ఈ గ్రహంపై జీవించేవన్నమాట. శిలాజాల ఆధారంగా పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బొద్దింకల పూర్వీకులు పాంగేయా అనే ప్రాచీన...